Share News

టీడీపీ బలోపేతానికి పనిచేయండి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:31 PM

టీడీపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కష్టపడిన కార్యకర్తకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

టీడీపీ బలోపేతానికి పనిచేయండి
జేఆర్‌పురంలో ప్రభుత్వ పథకాల కరపత్రం అందజేస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు:

రణస్థలం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కష్టపడిన కార్యకర్తకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం రణ స్థలంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ విస్తృస్థాయి సమావేశం నిర్వహించారు. అలాగే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యలు తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ దోహదపడుతోందని తెలిపారు. రణస్థలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్లలో కూటమిప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. స్త్రీశక్తి, తల్లికి వందనం, పింఛన్‌ పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాల కోసం ప్రజ లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి బాబ్జీ, డీజీఎం అనందరావు, ముప్పిడి సురేస్‌, కొమరాపు రవి, బెండు మల్లేశ్వరరావు, కళికంగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భవనేశ్వర్‌, రజిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.రాము పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:31 PM