Share News

బాధ్యతతో పనిచేయండి

ABN , Publish Date - May 12 , 2026 | 12:44 AM

Swachha narasannapeta స్వచ్ఛ నరసన్నపేట సాధనకు అధికారులు బాధ్యతతో సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. సోమవారం నరసన్నపేటలోని మారుతీనగర్‌, తమ్మయ్యపేట, బజారువీధి ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను, చెత్తసంపద కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

బాధ్యతతో పనిచేయండి
మారుతీనగర్‌లో పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

స్వచ్ఛ నరసన్నపేట దిశగా అడుగులు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

నరసన్నపేట, మే 11(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ నరసన్నపేట సాధనకు అధికారులు బాధ్యతతో సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. సోమవారం నరసన్నపేటలోని మారుతీనగర్‌, తమ్మయ్యపేట, బజారువీధి ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను, చెత్తసంపద కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ నెల 16న సీఎం నారా చంద్రబాబునాయుడు ‘స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో నరసన్నపేటలో 20 వార్డులను అద్దంలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా చెత్తసేకరణ, రీసైక్లింగ్‌ తదితర అంశాలపై సూచనలు చేశారు. ‘వీధుల్లో శతశాతం చెత్త తొలగించేందుకు ప్రత్యేకాధిరులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించాలి. రోడ్లపై ఇళ్ల నిర్మాణ సామగ్రిని తొలగించాల’ని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా మారుతీనగర్‌లో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కలెక్టర్‌ వద్ద మొరపెట్టుకున్నారు. అలాగే జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ నరసన్నపేటలో ముఖ్యకూడళ్లు వద్ద పండ్లు దుకాణాలు, తోపుడుబళ్లు వ్యాపారులకు పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే స్వచ్చరథం డ్రైవర్లతో ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహంలో సమావేశమయ్యారు. చెత్తసేకరణపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌, డీపీవో స్వరూపరాణి, డీఆర్‌సీ మేనేజర్‌ నిశ్చల, డీల్‌పీవోలు గోపిబాల, అలివేలు మంగమ్మ, పంచాది రాధ పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:44 AM