Share News

పనులు పూర్తిచేశారు.. పలకలు మరిచారు

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:59 PM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద ఓ కాలువపై నెలరోజుల కిందట తొలగించిన పలకలను నేటికీ తిరిగి ఏర్పాటుచేయలేదు.

పనులు పూర్తిచేశారు.. పలకలు మరిచారు
కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌లోని కాలువపై పలకలు వేయకుండా విడిచిపెట్టిన దృశ్యం :

కాశీబుగ్గ, జూలై 27(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద ఓ కాలువపై నెలరోజుల కిందట తొలగించిన పలకలను నేటికీ తిరిగి ఏర్పాటుచేయలేదు. ఇటీవల కురిసిన వర్షా లకు కాలువ మురుగు, చెత్తతో నిండిపోవడంతో శుభ్రపరిచేందుకు మునిసిపల్‌ సిబ్బంది కాలువ పై ఉన్న పలకలు తొలగించారు. పనులు పూర్త యిన అనంతరం కూడా పలకలు తిరిగి ఏర్పా టుచేయకపోవంతో కాలువ తెరిచే ఉంది. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌ నుంచి వచ్చే వాహనాలు ఆ కాలువ దాటి జిల్లాలోని పలు ప్రాంతా లకు వెళ్లాల్సిఉంది. అయితే మూడు రోడ్ల జంక్షన్‌ కాలువ తెరిచి ఉండడంతో వాహనాలు కాలువలోకి చొచ్చుకువెళ్లే ప్ర మాదముందని చోదకులలో పాటు పాదచారులు భయాం దోళన చెందుతున్నారు. ప్రధా నంగా చీకటిపడిన తర్వాత కాలువ కనిపించకపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు సా గించే వాహనచోదకులు ఇ బ్బంది పడుతున్నారు. తక్షణ మే మునిసిపల్‌ అధికారులు స్పందించి కాలువపై పలకలు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 11:59 PM