బీఆర్‌ఏయూలో ఉమెన్ గ్రీవెన్స్
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:52 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పాలనా కార్యాలయ భవనంలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ సమా వేశం మంగళవారం రహస్యంగా నిర్వహించగా అధికారులు, సభ్యులు హాజ రయ్యారు. ప్రధానంగా రెండు అంశాలపై చర్చించారు.
రెండు అంశాలపై అధికారుల చర్చ
ఎచ్చెర్ల రూరల్, జూలై 21(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పాలనా కార్యాలయ భవనంలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ సమా వేశం మంగళవారం రహస్యంగా నిర్వహించగా అధికారులు, సభ్యులు హాజ రయ్యారు. ప్రధానంగా రెండు అంశాలపై చర్చించారు. ఇతరులు అభి ప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఓ అధికారి తన తప్పులను సమర్థిం చుకున్నట్లు సమాచారం. సభ్యులు మాత్రం బాధితురాలు చెప్పింది విన్నారు కానీ ఆ అధికారి ఎదుట చెప్పే ప్రయత్నం చేయలేదని తెలిసింది. చర్చకు వచ్చిన రెండు అంశాలు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినవి కావడం గమనార్హం. ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ విద్యా ర్థినితో అసభ్యంగా ఫోన్‌లో మాట్లాడడం, ఈ కాల్ రికార్డింగ్ బయటపడ టాన్ని ఓ అధికారి తప్పుపట్టినట్లు సమాచారం. ఇటీవల ఈ అంశాలపై మీడియాలో విస్తృతంగా కథనాలు రాగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీని వేశారు. కమిటీ ముందు విద్యార్థిని హాజరు కాలేదన్న కారణంతో హాస్టల్ నుంచి ఆమెను పంపించాలని సదరు అధికారి ఆదేశించారు. దీంతో తోటి విద్యార్థులను వెంట పెట్టుకుని విద్యార్థిని తన కార్యాలయానికి వచ్చి నిరసనకు సిద్ధపడడంపై ఆ అధికారి తప్పుపట్టినట్లు తెలిసింది. ఇక రెండో అంశమైన ఇంజినీరింగ్ కాలేజ్‌లో మహిళా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో తోటి అసిస్టెంట్ ప్రొఫెసర్ వివాదంపై చర్చించారు.