Share News

తాగునీటి కోసం మహిళల ఆందోళన

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:01 AM

మా గ్రామంలో తాగునీటి కోసం రోజుల తరబడి ఇబ్బందులు పడు తున్నామని తీరప్రాంత గ్రామమైన కొత్తపాలేనికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

తాగునీటి కోసం మహిళల ఆందోళన
ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

కవిటి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మా గ్రామంలో తాగునీటి కోసం రోజుల తరబడి ఇబ్బందులు పడు తున్నామని తీరప్రాంత గ్రామమైన కొత్తపాలేనికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కొత్తపాలెం గ్రామానికి కొద్దిరోజులుగా తాగునీరు సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదని, దీంతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యామని వాపోయారు. ఎప్పుడు నీరు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యను గతంలో ఎమ్మెల్యే బి.అశోక్‌ దృష్టికి తీసుకువెళ్లగా పాఠశాల ఆవరణలో వాటర్‌ ట్యాంకు ఏర్పాటు చేశారన్నారు. కానీ ఆ ట్యాంకులోకి నీరు ఎప్పు డు వస్తుందో తెలియడం లేదన్నారు. ప్రస్తు తం కొద్ది రోజులుగా ఆ నీరు ట్యాంకుకు రాక పోవడంతో తాగునీటికై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తక్షణం సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం కార్యాలయ ఏవో కె.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. దీంతో ఆయన స్పందించి గ్రామాన్ని సందర్శించి తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఆ వెంటనే ట్యాంకుల ద్వారా గ్రామస్థులకు తాగునీటిని అందించారు.

Updated Date - Jan 28 , 2026 | 12:01 AM