మహిళా బిల్లు కొత్త శకానికి నాంది
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:48 PM
మహిళా బిల్లు కొత్త శకానికి నాంది అని తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్, జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలో నారీ శక్తి వందన్ కార్యక్రమం నిర్వహించారు.
అరసవల్లి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లు కొత్త శకానికి నాంది అని తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్, జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలో నారీ శక్తి వందన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33ు రిజర్వు చేయడం మహిళా సాధి కారితకు ఒక ముందడుగు అని తెలిపారు.మహిళలు అన్ని రంగాల్లో సమర్థ వంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దీనికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, టీడీపీ నాయకులు పిరియా మాధవి, పి.మహాలక్ష్మి, డి.రమణమ్మ, బీజేపీ నాయకులు వి.లలిత, జనసేన నాయకులు కె.సుశీల పాల్గొన్నారు.