వేతనాలివ్వడం లేదని మహిళా కార్మికుల ఫిర్యాదు
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:16 AM
సకాలంలో వేతనాలివ్వడం లేదని, వేతనాలపై అడిగితే కాంట్రాక్టర్ వేధింపులకు గురిచేస్తు న్నారని ఆదిత్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్, మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
అరసవల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): సకాలంలో వేతనాలివ్వడం లేదని, వేతనాలపై అడిగితే కాంట్రాక్టర్ వేధింపులకు గురిచేస్తు న్నారని ఆదిత్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్, మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తమకు ఇచ్చే వేతనాల్లో నెలకు రూ.2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, ఇదేమిటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతు న్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు ఒకటవ పట్టణ, మహిళా పోలీసుస్టేషన్ లోనూ సదరు కాంట్రాక్టరు దురాగతాలపై ఫిర్యా దు చేశారు. తమకు న్యాయం చేయాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, కాంట్రాక్టర్ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఈవో ప్రసాద్ స్పందిస్తూ.. వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐలు చెల్లింపులు సకాలంలో చేపట్టడం లేదని తన దృష్టికి వచ్చిందని, పరిశీ లించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.