Share News

మహిళా ఓటర్లే అధికం

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:44 AM

1,724,896 voters in the srikakulam district ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ముసాయిదా జాబితా శుక్రవారం విడుదలైంది. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 17,24,896 మంది ఓటర్లు ఉన్నట్టు లెక్క తేలింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్టు జాబితా స్పష్టం చేసింది. జిల్లాలో పురుషులు 8,54,771 మంది, మహిళలు 8,70,051 మంది ఓటర్లు ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 74 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మహిళా ఓటర్లే అధికం

ముసాయిదా జాబితా విడుదల

జిల్లాలో ఓటర్లు 17,24,896 మంది

అత్యధికంగా శ్రీకాకుళంలో.. అత్యల్పంగా ఆమదాలవలసలో నమోదు

శ్రీకాకుళం, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ముసాయిదా జాబితా శుక్రవారం విడుదలైంది. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 17,24,896 మంది ఓటర్లు ఉన్నట్టు లెక్క తేలింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్టు జాబితా స్పష్టం చేసింది. జిల్లాలో పురుషులు 8,54,771 మంది, మహిళలు 8,70,051 మంది ఓటర్లు ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 74 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మినహా, మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట) పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. ఎచ్చెర్లలో మాత్రం మహిళా ఓటర్లు (1,12,261) కన్నా పురుష ఓటర్లు (1,13,869) స్వల్పంగా ఆధిక్యంలో ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 2,51,218 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా ఆమదాలవలస నియోజకవర్గంలో 1,77,870 మంది ఓటర్లు నమోదయ్యారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు సైతం అత్యధికంగా శ్రీకాకుళంలో 21 మంది నమోదు కాగా, ఆమదాలవలసలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువచోట ఓటుహక్కు ఉన్నవారి పేరు ఒకే చోట కొనసాగించారు. నిజమైన ఓటర్లు ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకునే అవకాశముంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అక్టోబరు 3న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

సర్వీసు ఓటర్లు ఇలా

తాజా జాబితాలో సర్వీసు ఓటర్ల వివరాలను సైతం పొందుపరిచారు. జిల్లావ్యాప్తంగా 15,933 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా పలాస నియోజకవర్గంలో 2,945 మంది నమోదు కాగా, టెక్కలిలో 2,830 మంది ఉన్నారు. అత్యల్పంగా ఎచ్చెర్లలో 918 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఇచ్ఛాపురంలో 1,955 మంది, పాతపట్నంలో 1,722 మంది, శ్రీకాకుళంలో 1,231 మంది, ఆమదాలవలసలో 2,184 మంది, నరసన్నపేటలో 2,148 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.

ముసాయిదా ఓటర్ల జాబితా

===============================================================

నియోజకవర్గం పురుషులు మహిళలు థర్డ్‌జెండర్‌ మొత్తం

================================================================

ఇచ్ఛాపురం 1,17,372 1,24,211 16 2,41,599

పలాస 98,523 1,03,297 8 2,01,828

టెక్కలి 1,08,689 1,09,129 6 2,17,824

పాతపట్నం 1,03,980 1,04,620 7 2,08,607

శ్రీకాకుళం 1,23,861 1,27,336 21 2,51,218

ఆమదాలవలస 88,657 89,212 1 1,77,870

ఎచ్చెర్ల 1,13,869 1,12,261 12 2,26,142

నరసన్నపేట 99,820 99,985 3 1,99,808

=================================================================

మొత్తం 8,54,771 8,70,051 74 17,24,896

==================================================================

Updated Date - Aug 01 , 2026 | 12:44 AM