Share News

మహిళలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 28 , 2026 | 11:32 PM

మహిళలు ప్రయాణాలు చేసే సమ యంలో ధరించే ఆభరణాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ బి.హైమా వతి సూచించారు. గురువారం మండలంలోని నందికొండ గ్రామంలో జరుగుతున్న ఉపాధిపథకం పనుల్లో వేతనదారులకు పోలీసులు అవగాహ న కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి
అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ హైమావతి:

సరుబుజ్జిలి, మే 28 (ఆంధ్రజ్యోతి): మహిళలు ప్రయాణాలు చేసే సమ యంలో ధరించే ఆభరణాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ బి.హైమా వతి సూచించారు. గురువారం మండలంలోని నందికొండ గ్రామంలో జరుగుతున్న ఉపాధిపథకం పనుల్లో వేతనదారులకు పోలీసులు అవగాహ న కార్యక్రమాన్ని నిర్వహించారు. శరభ సాగరం చెరువులో ఉపాధి పనులను నిర్వహిస్తున్న మహిళా కూలీలకు స్థానిక ఎస్‌ఐ బి.హైమావతి నారీశక్తి యాప్‌పై వివరించారు. మహిళలను అన్ని విధాలుగా రక్షించడా నికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించాయని తెలి పారు.ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టాలపై అవగాహన పొందడంతో పాటు ఆపద సమయంలో ఉన్న మహిళలు నారీశక్తి యాప్‌ ద్వారా తక్షణ రక్షణ పొందాలని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - May 28 , 2026 | 11:32 PM