అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:14 AM
మండలంలోని గొల్లవూరుకి చెందిన వివాహిత పిన్నింటి ఊర్వశి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బారువ పోలీసులు తెలిపారు.
సోంపేట రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్లవూరుకి చెందిన వివాహిత పిన్నింటి ఊర్వశి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బారువ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోంపేట సీఐ మంగరాజు, బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొల్లగండి కాలనీలో ఉన్న ఇంటిలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. మార్చి 13న ఊర్వశి భర్త పిన్నింటి రాజారావు ఆత్మహత్య చేసు కోవడంతో ఇద్దరు పిల్లలను ఊర్వశి పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఊర్వశి మృతితో ఇద్దరు చిన్నారులు అనాఽథల్లా మిగిలి పోయారు. తల్లిదం డ్రులను కోల్పోయిన చిన్నారులు రోదిస్తున్నారు. ఊర్వశి మృతికి గల కారణాలు పోలీసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.