Share News

అగ్ని ప్రమాదానికి గురైన మహిళ మృతి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:47 PM

అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన మెండ సీతమ్మ(54) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

అగ్ని ప్రమాదానికి గురైన మహిళ మృతి

నరసన్నపేట, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన మెండ సీతమ్మ(54) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక శ్రీనివాసనగర్‌ సమీపంలోగల సాయినగర్‌లో నివాసముంటున్న సీతమ్మ తన ఇంట్లో శనివారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం రాగోలు జేమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సీతమ్మ భర్త సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ అసిరినాయుడు తెలిపారు కాగా ఈమె భర్త సింహాచలం గృహానిర్మాణశాఖలో పనిచేస్తుండగా.. కుమార్తె మెండ షాలిని ఉర్లాం పీహెచ్‌సీలో వైద్యరాలిగా వైద్య సేవలందిస్తున్నారు.

చెన్నైలో జిల్లాకు చెందిన వలస కూలీ..

పాతపట్నం/రూరల్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం గ్రామానికి చెందిన సలాం సోమేశ్వర రావు శుకవ్రారం ప్రమాదవశాత్తు మృతిచెందారు. సోమేశ్వరరావు వలస కార్మికుడిగా ఉంటూ చెన్నైలో ఓ భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. మూడో అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడంతో మృతిచెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయనకు భార్య లక్ష్మి, కుమారుడు సాయిచరణ్‌ ఉన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:47 PM