చెత్త తరలించక.. స్వచ్ఛతకు నోచుకోక
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:46 PM
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అటకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరు కుపోతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తు న్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నా ఫాగిం గ్ సైతం చేయడంలేన్న విమర్శలొస్తున్నాయి.
కోటబొమ్మాళి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అటకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరు కుపోతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తు న్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నా ఫాగిం గ్ సైతం చేయడంలేన్న విమర్శలొస్తున్నాయి.
మండలంలోని కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ తోపాటు చిట్టేవలస, చిన్నబమ్మిడి, చీపుర్లపాడు, కన్నేవ లస, యలమంచిలి, లఖందిడ్డి, మాసాహెబ్‌పేట, తాటి పర్తి, పట్టుపురం, కిష్టుపురం, జర్జంగి, సౌడాం, కురుడు, కొత్తపల్లి తదితర పంచాయతీల్లో పారిశుఽధ్య నిర్వ హణ అటకెక్కుతోంది. 38 పంచాయతీల పరిధిలోగల గ్రామీణ ప్రాంతాల్లో కచ్చారోడ్లతో పాటు మారుమూల గల వీధులు, ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చెత్త పేరుకుపోతోంది. రోజుల తరబడి మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం తో పూడుకుపోవడంతో వాడుక నీరు రోడ్లపైకి చేరు తోంది. దీంతో దుర్వాసన వెలువడుతుండడంతో దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో వ్యాధులు ప్రబ లుతాయోమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వం ప్రతిమూడో శనివారం నిర్వహి స్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం పై ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక వెరసి ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యిందన్న పలువురు విమర్శస్తున్నారు.
చెత్త రోడ్డు పక్కన ఉంటే చర్యలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ సచివా లయ అధికారులను సూచించామని కోటబొమ్మాళి ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ తెలిపారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి రోజూ చెత్తను తొలగిం చాలని ఆదేశించామని చెప్పారు. ఏ పంచా యతీ లోనైనా చెత్త రోడ్డు పక్కన ఉంటే సంబందిత కార్య దర్శులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.