అనుమతులు లేకుండానే
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:38 PM
ఎటువంటి అనుమతులు లేకుండా ఐటీడీఏ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్లను నరికి అక్రమార్కులు తరలించుకుపోతున్నారు.
కలప దుంగల రవాణా
మందస (పలాస), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి అనుమతులు లేకుండా ఐటీడీఏ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్లను నరికి అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. ఆరబ్ తుఫాన్‌కు ఇక్కడున్న అనేక చెట్లు పడిపోయాయి. వీటిని తొలగించడానికి వేలం నిర్వహించాలి. ఆదాయం సమకూరిన తరువాత వాటిని తరలించాల్సి ఉంది. అయితే, కొంతమంది అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లను నరికి దుంగలను ట్రాక్టర్లపై తరలిస్తున్నా రు. ప్రస్తుతం టన్ను కలప రూ.20 వేల వరకూ మార్కెట్‌లో ధర పలుకుతోంది. దీని ప్రకారం అక్రమార్కులు తరలిస్తున్న కలప ధర రూ.లక్షల్లో ఉంటుంది. సమీ పంలో సంబంధిత అధికారులు ఉంటున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.