స్థల సేకరణ కాక.. పనులు జరగక
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:46 PM
: భూసేకర ణలో అధికారులు జాప్యం ప్రదర్శించడం వల్ల 326ఎ జాతీయరహదారి పనులకు అంతరాయం కలుగుతోం ది. పాతపట్నంలోని జాతీయరహదారికి ఆనుకొని ఉన్న ఏఎంసీ నుంచి సబ్‌స్టేషన్ వరకు రోడ్ నిర్మాణా నికి స్థలసేకరణ జరగాల్సి ఉంది.
పాతపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): భూసేకర ణలో అధికారులు జాప్యం ప్రదర్శించడం వల్ల 326ఎ జాతీయరహదారి పనులకు అంతరాయం కలుగుతోం ది. పాతపట్నంలోని జాతీయరహదారికి ఆనుకొని ఉన్న ఏఎంసీ నుంచి సబ్‌స్టేషన్ వరకు రోడ్ నిర్మాణా నికి స్థలసేకరణ జరగాల్సి ఉంది. ఒకవైపు ఈ ఏడాది చివరినాటికి జాతీయరహదారి పనులు పూర్తి చేస్తా మని నిర్వాహకులు ప్రకటిస్తున్న విషయం విదితమే. అయితే ఇప్పటికేఫ్లైఓవర్ వంతెన పనులు నీలమణి దుర్గ ఆలయం వైపు జరుగుతున్నాయి. స్థల సేకరణ కాకపోవడంతో సబ్‌స్టేషన్, ఏఎంసీ ప్రహరీకి ఆనకుని సర్వీసు రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్న వరకూ పూర్తిచేసి మిగి లిన పనులు విడిచిపెడతారన్న సందేహాలు వ్యక్తమ వుతున్నాయి. భూసేకరణ వేగవంతం చేసి రోడ్డు పనులుపనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పాతపట్నం వాసులు కోరుతున్నారు. ఏఎంసీ ప్రహరీ నుంచి సబ్ స్టేషన్ వరకూ సుమారు 150మీటర్ల స్థలం అప్పగించకపోవడంతో పనులు నిలిచిపోయా యి. దీంతో ఈ ప్రదేశంలో వాహనాల రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వేస్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయం, బీఆర్ అంబేడ్కర్ గురుకులం, బాలికల పోస్టుమెట్రిక్ వసతిగృహాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు, అధికారులు కోదూరు ప్రజలు ఈమార్గం గుండానే రాకపోకలు సాగించాల్సిఉంది. కాగా భూసేకరణ పూర్తయ్యిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే జాతీయరహదారి విభాగం నుంచి ఏఎంసీ విద్యుత్‌శాఖలకు భూసేకరణకు చెల్లించాల్సిన చెల్లిం పులు ఇంకాకాలేదని చెప్పారు. దీంతో ఏఎంసీ, విద్యుత్‌శాఖ అధికారులు సంబంధి స్థలాన్ని జాతీయ రహదారి పనుల నిర్వాహకులకు ఇంకా అప్పగించ లేదని తెలిపారు.