బిల్లులు కాక.. పనులు సాగక
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:57 PM
మండలంలోని తిడ్డిమి పంచాయతీ పరిధిలో గల బైరాగిపేట నుంచి దశరథపురం మీదుగా చంగుడి వరకు రహదారి పనులు బిల్లులు కాకపోవడంతో ముందుకు సాగడంలేదు. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రహదారి పనులు నిలిచి పోవడంతో రాళ్లు తేలడం వల్ల వాహనచోదకులు, పాదచారులు రాకపో కలు సాగించలేకపోతున్నారు.
పాతపట్నంరూరల్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిడ్డిమి పంచాయతీ పరిధిలో గల బైరాగిపేట నుంచి దశరథపురం మీదుగా చంగుడి వరకు రహదారి పనులు బిల్లులు కాకపోవడంతో ముందుకు సాగడంలేదు. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రహదారి పనులు నిలిచి పోవడంతో రాళ్లు తేలడం వల్ల వాహనచోదకులు, పాదచారులు రాకపో కలు సాగించలేకపోతున్నారు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో దృష్టిసారించింది. బైరాగి పేట నుంచి దశరథపురం మీదుగా చంగుడి వరకు రహదారి పనులు సుమారు రూ.లక్షా70వేలతో ప్రారంభించి సుమారు ఏడాది గడుస్తోంది. అయితే పనులు పూర్తికాకపోవడంతో గులకరాళ్లు తేలడం వల్ల ఆ రహదారిలో వాహనచోదకులు అగచాట్లకు గురవుతున్నారు. రోడ్డుపై మెటల్ తేలడంతో ద్విచక్రవాహనాలు జారిపడే ప్రమాదముందని పలు వురు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే పరిస్థితి మరింత దారు ణంగా మారే అవకాశమెందని స్థానికులు ఆందోళన వ్య క్తంచేస్తున్నారు. కాగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కొద్దిరోజుల్లో పనులు ప్రారం భించనున్నామని పీఆర్ ఏఈ మోహనరావు తెలిపారు