బిల్లులు కాక.. పనులు జరగక
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:06 AM
మండలంలోని భగీరఽథపురంలో సంపద కేంద్రం పనులు(ఎస్‌డబ్ల్యూపీసీ) బిల్లులు కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ఇక్కడ రెండేళ్ల కిందట చెత్త సంపద కేంద్రం పనులు చేపట్టారు.
హిరమండలం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని భగీరఽథపురంలో సంపద కేంద్రం పనులు(ఎస్‌డబ్ల్యూపీసీ) బిల్లులు కాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ఇక్కడ రెండేళ్ల కిందట చెత్త సంపద కేంద్రం పనులు చేపట్టారు. ఇందులో భాగంగా పంచాయతీ పరిధిలో ప్రతిఒక్కరూ వ్యక్తిగత,పరిసరాల శుభ్రతపాటించడంతోపాటు తడి,పొడ చెత్తను వేరుచేసి కార్మికులకు అందించాలి. అలా సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రానికి తరలించి సేంద్రీయ ఎరువులు తయారుచేసి రైతులకు విక్రయించి పంచాయతీకి ఆదాయవనరులు సమకూర్చేలా చర్యలు తీసుకోవా ల్సిఉంది. ఈమేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.4.36 లక్షల అంచనావ్యయంతో రెండేళ్ల కిందట చెత్తసంపద కేంద్రం పనులు చేపట్టారు. ఉపాధిహామీ పథకం ద్వారా రూ.లక్ష ఖర్చుచేశారు.అయితే బిల్లుల మం జూరుకాకపోవడంతో పంచాయతీ నిధుల నుంచి మరో రూ.లక్ష ఖర్చుచేశారు. ఇప్పటివరకూ స్తంభాలవేసి వాటి మీద రేకులు ఏర్పాటు చేశారు. పక్కన తొట్టెలు నిర్మించిన మిగతాపనులు నిలిపివేశారు. సంపద కేంద్రం పనులు పూర్తిచేయకపోవడంతో గ్రామంలో చెత్త అక్కడికి తరలించకే వీలు లేకుండాపోయింది.దీంతో వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో అపరిశు భ్ర వాతా వరణంనెలకొందని పలువురు వాపోతున్నారు. తక్షణమే చెత్త సంపద కేంద్రాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.