Share News

పాతిపెట్టిన రెండు గంటల్లోనే..

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:17 AM

Exploding fireworks సారవకోట పోలీసుస్టేషన్‌ వెనుక పాతిపెట్టిన బాణసంచా సామగ్రి శనివారం మధ్యాహ్నం పేలింది. పెద్ద శబ్దం వచ్చి మట్టి చెల్లాచెదురుగా పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది

పాతిపెట్టిన రెండు గంటల్లోనే..
బాణసంచా పేలి చెల్లాచెదురైన మట్టి

పేలిన బాణసంచా సామగ్రి

పోలీసుస్టేషన్‌ సమీపంలో ఘటన

జలుమూరు(సారవకోట), ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): సారవకోట పోలీసుస్టేషన్‌ వెనుక పాతిపెట్టిన బాణసంచా సామగ్రి శనివారం మధ్యాహ్నం పేలింది. పెద్ద శబ్దం వచ్చి మట్టి చెల్లాచెదురుగా పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వివరాల మేరకు.. గతేడాది దీపావళి సమయంలో బుడితిలో అక్రమంగా విక్రయిస్తున్న బాణసంచా సామగ్రిని పోలీసులు సీజ్‌ చేశారు. దానిని పాతిపెట్టేందుకు పాతపట్నం కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సారవకోట పోలీసుస్టేషన్‌ వెనుక ఖాళీ స్థలం బాణసంచా సామగ్రి పాతిపెట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అది పేలి పెద్ద శబ్దం రావడంతో పరిసర ప్రజలు పరుగులు తీశారు. దగ్గరలో ఎవరూ లేకపోవడం.. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా.. ‘పోలీసుస్టేషన్‌ వెనుక ఖాళీ స్థలంలో డిస్పోజబుల్‌ టీమ్‌, వీఆర్వో సమక్షంలో బాణసంచా సామగ్రి పాతిపెట్టాం. ఎండ తీవ్రతకు వేడెక్కి పేలి.. మట్టి చెల్లాచెదురైంది. ఎటువంటి ప్రమాదం జరగలేద’ని తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 12:17 AM