కలెక్టర్ ఆదేశించిన నిమిషాల్లోనే..
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:02 AM
జిల్లా కలెక్టర్ ఆదేశించిన నిమిషాల వ్యవధిలోనే మునిసిపల్ అధికారులు స్పందించి.. అక్రమం గా వేసిన లేఅవుట్‌ను తొలగించారు.
అనధికార లేఅవుట్ తొలగించిన మునిసిపల్ అధికారులు
పలాస, జనవరి 30(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ ఆదేశించిన నిమిషాల వ్యవధిలోనే మునిసిపల్ అధికారులు స్పందించి.. అక్రమం గా వేసిన లేఅవుట్‌ను తొలగించారు. వివరా ల్లోకి వెళ్తే.. జగన్నాథసాగరం చెరువు వద్ద అనధికార లేఅవుట్ వేయగానికి చెరువు గర్భా న్ని కొంతమంది పూడ్చారు. సుమారు 0.42 ఎకరాల వరకూ ఆక్రమించి రోడ్డు వేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం స్వయంగా వచ్చి ఆక్రమణలు పరిశీలించారు. లేఅవుట్‌కు అనుమతులపై కమిషనర్ ఇ.శ్రీని వాసులను కలెక్టర్ ప్రశ్నించగా.. ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ ప్రశ్నించగా.. తక్షణమే తొలగిస్తామని కమిషనర్ బదు లిచ్చారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపాలని కలెక్టర్ ఆదేశిం చారు. దీంతో నిమిషాల్లోనే మునిసిపల్ ఎక్స్‌కవేటర్, సిబ్బంది తో సహా కమిషనర్ ఆ ప్రాంతానికి చేరుకొని ఆ లేఅవుట్‌ను తొలగించి.. కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. అంతకుముందు కలెక్టర్, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ బృందం కాశీబుగ్గ ఆర్వోబీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. నిధులు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.