Share News

రిటైర్డ్‌ ఏసీటీవోపై చర్యల ఉపసంహరణ

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:53 PM

ఇచ్ఛాపురం మండలం పురుషో త్తపురం సమీకృత చెక్‌ పోస్ట్‌పై 2010లో జరిగిన ఏసీబీ తనిఖీల కేసుకు సంబంధించి అప్పటి ఏసీటీవో యు.సత్యవతిపై తదుపరి చర్యలను ప్రభు త్వం ఉపసంహరించుకుంది.

రిటైర్డ్‌ ఏసీటీవోపై చర్యల ఉపసంహరణ

శ్రీకాకుళం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మండలం పురుషో త్తపురం సమీకృత చెక్‌ పోస్ట్‌పై 2010లో జరిగిన ఏసీబీ తనిఖీల కేసుకు సంబంధించి అప్పటి ఏసీటీవో యు.సత్యవతిపై తదుపరి చర్యలను ప్రభు త్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌ కుమార్‌ సోమవారం జీవోఆర్టీ నెంబర్‌ 909ను జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పురుషోత్తపురం చెక్‌పోస్ట్‌లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో 2010 డిసెంబరు 16న ఏసీబీ అధి కారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన వాణిజ్య పన్నులు, వ్యవసాయం, రవాణా తదితర శాఖలకు చెందిన 8 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అప్పట్లో ప్రభు త్వానికి సిఫార్సు చేశారు. వీరిలో ఒకరైన యు.సత్యవతి వయోపరిమితి ముగియడంతో 2011 జూన్‌ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌-1980 లోని రూల్‌ 9(2)బి(2) ప్రకారం ఒక ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత వారిపై అభియోగాలు నమోదు చేసేందుకు నాలుగేళ్ల గరిష్ట పరిమితి ఉంటుంది. సత్యవతి ఉద్యోగ విరమణ చేసి నాలుగేళ్ల గడు వు ఎప్పుడో ముగిసిపోయినందున నిబంధనల ప్రకారం ఆమెపై తదుపరి చర్యలను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - Jun 01 , 2026 | 11:53 PM