వైసీపీలో అంతర్గత విభేదాలతోనే విత్‌డ్రా
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:16 AM
పొందూరు మండలంలో వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలతో పలువురు అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకుంటే ఆ పార్టీ నాయకుడు చింతాడ రవికుమార్ మాపై నిందలు వేయడం భావ్యం కాదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
అయినా మాపై ఆ పార్టీ నేత నిందలా?: రవికుమార్
పొందూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పొందూరు మండలంలో వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలతో పలువురు అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకుంటే ఆ పార్టీ నాయకుడు చింతాడ రవికుమార్ మాపై నిందలు వేయడం భావ్యం కాదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లా డుతూ.. మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంపై చింతాడ చేసిన ఆరోపణలను ఖండించారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై అస భ్యంగా ప్రవర్తించి విలువలకు పాతరేసిన చింతాడ ప్రజాస్వామ్యం గురిం చి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన పోకడలు నచ్చక ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తు లకు ఎంపీపీ పదవిపై చూపిన ఆశలు బయటపడడంతో ఆ పార్టీ నా యకులే విత్‌డ్రాలకు కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ఎన్ని కల్లో దళ్లవలసలో 16 ఓట్ల తేడాతో పరాజయం పొందిన వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించుకున్న విషయం అందరికీ తెలుసునన్నారు. ఏకగ్రీ వంగా గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే రవికుమార్ అభినందించారు. సమా వేశంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సీహెచ్ రామ్మోహన్, ఎ.చిన రంగ, మాజీ ఏఎంసీ చైర్మన్ అన్నెపు రాము, పార్టీ నాయకులు బలగ శంకర భాస్కర్, బాడాన గిరి తదితరులు పాల్గొన్నారు.