నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:30 AM
నడిమివలస-గదబ పాలెం గ్రామ సమీపంలో ఉ న్న కొండలో సుమారుగా 202 ఎకరా లను ప్రభుత్వం స్వాధీనం చేసు కునేందుకు రంగంసిద్ధం చేస్తోం దని, దీనిని తక్షణం ఉపసంహ రించు కోవాలని నడిమివలస భూముల రక్షణ కమిటీ అధ్యక్షుడు ఇజ్జిరోతు రమేష్ తదితరులు కోరారు.
నడిమివలస-గదబపాలెం కొండ రైతుల వినతి
జి సిగడాం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నడిమివలస-గదబ పాలెం గ్రామ సమీపంలో ఉ న్న కొండలో సుమారుగా 202 ఎకరా లను ప్రభుత్వం స్వాధీనం చేసు కునేందుకు రంగంసిద్ధం చేస్తోం దని, దీనిని తక్షణం ఉపసంహ రించు కోవాలని నడిమివలస భూముల రక్షణ కమిటీ అధ్యక్షుడు ఇజ్జిరోతు రమేష్ తదితరులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయా ల ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కొండలో ఏపీఐఐసీ పరిశ్రమవాడగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. పచ్చని భూములను విధ్వంసం చేయడానికి వీల్లేదన్నారు. ఎట్టిపరి స్థితుల్లోనూ కొండను ఇచ్చేది లేదని, ఇదే మాకు ఆధారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు యడ్ల గౌరీనాయుడు వంకల గణపతి, అప్పల నాయుడు, రవి జగదీశ్వరరావు, దాలినాయుడు, సత్యంనాయుడు, అప్పల సూరి, రమణ, నారా యణరావు, అప్పన్న, సూరి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.