అయస్కాంతం సాయంతో..
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:59 PM
దొంగత నాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయనడానికి ఈ ఘట ననే నిదర్శనంగా చెప్పొచ్చు. ఓ వ్యక్తి అస్కాంతం సాయం తో ఆలయ హుండీలోని డబ్బులు కాజేసిన సంఘటన మండలంలోని అంబావల్లి గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి చోటు చేసుకుంది.
త్రినాథస్వామి ఆలయంలో చోరీ
సీసీ ఫుటేజీలో రికార్డు
అంబావల్లిలో ఘటన.. గ్రామస్థుడి పనే?
హిరమండలం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): దొంగత నాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయనడానికి ఈ ఘట ననే నిదర్శనంగా చెప్పొచ్చు. ఓ వ్యక్తి అస్కాంతం సాయం తో ఆలయ హుండీలోని డబ్బులు కాజేసిన సంఘటన మండలంలోని అంబావల్లి గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఈ చోరీకి సంబంధించి ఆల యంలో ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో విష యం బయపడింది. వివరాల్లోకి వెళ్తే.. అంబావల్లి గ్రా మంలో త్రినాఽథస్వామి ఆలయం ఉంది. ఓ వ్యక్తి తాడు కి ఒక అయస్కాంతం కట్టి ఆలయంలో ఉన్న హుండీ లో వేయగా.. దానికి అంటుకున్న క్వాయిన్స్, వాటి మ ధ్యన ఉండి పోయిన నోట్లను తీస్తున్నట్టు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ చోరీకి పాల్పడింది అదే గ్రామా నికి చెందిన వ్యక్తేనని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్‌ఐ మంధుసూదనరావు మాట్లాడుతూ.. ఈ చోరీ ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ గ్రామ పెద్దలను పిలిపించి విచారిస్తున్నామని, అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తానని స్పష్టం చేశారు.