కాలువలు ఇలా.. సాగునీరు ఎలా?
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:18 PM
వంశధార కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో శివారు భూములకు సాగు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
- శివారు ప్రాంతాల్లో పంటలకు నష్టం
- కంటతడి పెడుతున్న రైతులు
జలుమూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) వంశధార కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో శివారు భూములకు సాగు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలో 19ఆర్ కాలువ ద్వారా పర్లాం, అంధవరం, రామకృష్ణాపురం మాకివలస తదితర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ భూములకు సాగునీరందక ఖరీఫ్ పంటలు నష్టపోతున్నామని కంటతడి పెడుతున్నారు. ప్రతి ఏటా కాలువల్లో గుర్రపుడెక్క తొలగిస్తున్నప్పటికీ నీటి ప్రవాహానికి మళ్లీ వచ్చి చేరుతుందని అంటున్నారు. పేరుకే వంశధార కాలువలు ఉన్నాయి తప్ప తమ ప్రాంతాలకు సాగునీరు అందక పంటలు నష్టపోతున్నామన్నారు. 19ఆర్ కాలువ ద్వారా తిమడాం వరకు వ్యవసాయ భూములకు సాగునీరంది, లింగన్నాయుడుపేట, మాకివలస, యాతపేట, పర్లాం, అంధవరం, రామకృష్ణాపురం ప్రాంతాల శివారు భూములకు నీరందడం లేదని రైతులు ఆవేద న చెందతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువల్లో పూడికలు తీయించి, సక్రమంగా నీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.