కళ్లలో కారంకొట్టి..
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:46 PM
స్నానం కోసం చెరువుకి వెళ్తున్న ఓ మ హిళ కళ్లలో కారంకొట్టి బంగారం పుస్తెలుతాడు, చైన్ చోరీ చేసిన ఘటన ఆదివా రం నర్సిపురంలో చోటుచేసుకుంది.
పుస్తెలతాడు, చైన్ చోరీ
నందిగాం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): స్నానం కోసం చెరువుకి వెళ్తున్న ఓ మ హిళ కళ్లలో కారంకొట్టి బంగారం పుస్తెలుతాడు, చైన్ చోరీ చేసిన ఘటన ఆదివా రం నర్సిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మే రకు.. గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి స్నానం కోసం గ్రామ శివారులో గల గొడేబంద చెరువుకు వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరి వ్యక్తులు అడ్డగిం చారు. ఈ క్రమంలో మహలక్ష్మి కళ్లల్లో కారం కొట్టారు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారం పుస్తెలతాడు, చైన్‌ను తెంచుకుని పారిపోయారు. భర్త పార్వతీశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.