కేంద్రమంత్రిని కలిసిన విజేతలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:00 AM
ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో గెలు పొందిన టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో గెలు పొందిన టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వారిని అభినందించి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు క్యాంపు కార్యాలయంలో టీడీపీ నేతలతో నందడి నెలకొంది.
కంచిలి నుంచి..
కంచిలి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ తరపున విజే తలుగా నిలిచిన ఎంపీటీసీ సభ్యులు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని సోమవారం మర్యాదపూర్వకంగా శ్రీకాకుళంలో కలిశారు. ఈ సందర్భంగా విజేతలను ఆయన అభినందించి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవా లని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు తదితరులు పాల్గొన్నారు.
మునిసిపల్ కౌన్సిలర్..
ఇచ్ఛాపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి గెలు పొందిన నందికి జానీ సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జానీని అభినందించారు. పట్టణాభివృద్ధి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో దామో దర్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.