Share News

కష్టపడి నిధులు సమకూరిస్తే నిద్రపోతారా?

ABN , Publish Date - May 23 , 2026 | 11:27 PM

నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం శ్రమించి నిధులు సమకూరిస్తే అధికారులు నిద్రపోవడం ఏమిటని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కష్టపడి నిధులు సమకూరిస్తే నిద్రపోతారా?
కంపోస్టింగ్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

మునిసిపల్‌ అధికారుల తీరుపై ఎమ్మెల్యే రవికుమార్‌ ఆగ్రహం

కంపోస్టింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన

ఆమదాలవలస, మే 23 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం శ్రమించి నిధులు సమకూరిస్తే అధికారులు నిద్రపోవడం ఏమిటని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిధి తాళ్ల వలస డంపింగ్‌యార్డ్‌లో రూ.3.62 కోట్లతో కంపోస్టింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మునినిపల్‌ పరిధిలో జరుగు తున్న వివిధ అభివృద్ధి పనులు, నిధులు మంజూరుపై సంబం ధిత అధికారులతో సమీక్షించారు. డంపింగ్‌ యార్డ్‌లో చెత్త నిల్వ ఎంతవరకు ఉంటుంది, ఇప్పటి వరకు సేక రించిన చెత్తను ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టించే యంత్రాలను మంజూరు చేసిం దని ఆమదా లవలస మునిసిపాలిటీ నుంచి ప్రతిపాదనలు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్‌ తమ్మినేని రవి, మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పిన సమాధానంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు మారాలని స్పష్టంచేశారు. తిమ్మా పురంలో జలశుద్ధి యంత్ర నిర్మా ణానికి శంకు స్థాపన చేసి ఏడాదవు తున్నా పనులు ఎందుకు చేపట్ట లేదన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని 23 వార్డుల్లో మెరు గైన కాలువ వ్యవస్థ ఏర్పాటు కు రూ.5 కోట్ల సుడా నిధులు మంజూరు చేసించి తీసుకువస్తే ఇప్పటి వరకు టెండర్లు పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటని సంబంధిత అధి కారులను ప్రశ్నించగా వేరు విధంగా ప్రతి పాదనలు పంపామని ఇంజనీరింగ్‌ అధికారులిచ్చిన సమాధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా టెండ ర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. శరవేగంగా పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు ఈ కంపో స్టింగ్‌ యూనిట్‌ దోహదప డుతుందని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాల న్నారు. కార్యక్రమంలో మునిసి పల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతావిద్యాసాగర్‌, రాష్ట్ర మెడికల్‌ బోర్డు సభ్యు డు డాక్టర్‌ చాపర సుధాకర్‌, టీడీపీ నాయకులు నాగళ్ల మురళీధర్‌యాదవ్‌, సిమ్మ మాధవి, తంగి గురయ్య, ఎస్‌.మురళీధర్‌, ఎన్ని శ్రీదేవి, కేవీ రాజ్యలక్ష్మి, బి.గౌరీపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:27 PM