చిన్నబజారు విస్తరణకు మోక్షం కలిగేనా?
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:44 PM
మేజర్ పంచా యతీలోని చిన్నబజారు విస్తరణకు నోచుకోవడం లేదు. ఎన్ని దశాబ్దాలైనా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.
- దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య
- నిత్యం ట్రాఫిక్ కష్టాలు
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
టెక్కలి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మేజర్ పంచా యతీలోని చిన్నబజారు విస్తరణకు నోచుకోవడం లేదు. ఎన్ని దశాబ్దాలైనా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో నిత్యం ట్రాఫిక్ నిలిచిపో తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మేజర్ పంచాయతీలో నిత్యం అత్యంత రద్దీ అయిన ప్రాంతం చిన్నబజారు. కాయగూరల దుకాణాలు, కిరాణాషాపులు, చికెన్, మటన్ షాపులు, చేపలబజారు, తోపుడుబండ్ల వ్యాపారాలతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉం టుంది. ఆది, మంగళ, బుధవారాల్లో అయితే అడు గుతీసి అడుగు వేయలేని పరిస్థితి. కొందరు రోడ్డు మీదకు వచ్చి వ్యాపారాలు చేయడం, పార్కింగ్ చేసుకునేందుకు స్థలం లేక రోడ్లపై ఎక్కడబడితే అక్కడే వాహనాలను నిలిపివేస్తుండడంతో చిన్నబ జారులో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గత ఏడాదిగా ఈ ప్రాంతాన్ని మూడుసార్లు పరిశీలించి రోడ్లు, కాలు వలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తోపుడు బండ్లను రోడ్లపై ఉంచకుండా చిన్నబజారులో రెవెన్యూ అసోసియేషన్‌కు కేటాయించిన స్థలంలో పెట్టుకునేలా చూడాలని అధికారులను ఆదేశించా రు. దీంతో అప్పట్లో తోపుడుబండ్లను ఉంచుకునేం దుకు అధికారులు మార్కింగ్ సైతం వేశారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో చిన్నబజారులో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. రోడ్లపై ఉన్న ఆక్రమణలు సైతం తొలగించాలని పలువురు కోరుతున్నారు. చిన్నబజారు రద్దీ అంశమై పంచా యతీ కార్యదర్శి ఏవీ శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా ‘చికెన్ చేపల మార్కెట్ ఈ ప్రాంతంలో ఉండ డంతో ఎక్కువ రద్దీ ఏర్పడుతుంది. ఇక్కడ కాలువ లు, రోడ్ల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ప్రతిపాదనలు చేశాం.’ అని తెలిపారు.