Share News

వంతెన పూర్తయ్యేనా?

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:22 PM

బారువ వద్ద మహేంద్రతనయ నదిపై చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 వంతెన పూర్తయ్యేనా?
మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న వంతెన

- ఇప్పటి వరకు 80శాతం పూర్తి

-పనులు పునఃప్రారంభంకావడంతో చిగురిస్తున్న ఆశలు

సోంపేట రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): బారువ వద్ద మహేంద్రతనయ నదిపై చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వంతెన పూర్తయితే సోంపేట, మందస మండలాల పరిధిలోని సుమారు 30 గ్రామాల ప్రజలకు బారువకు రాకపోకలు సులభతరం కానున్నాయి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలే దు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తిరిగి ప్రారంభం కావడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఉపాధి హామీ పథకం కింద రూ.10 కోట్ల వ్యయంతో 1.75 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న వం తెన పనులు ప్రస్తుతం 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే అక్టోబరు నాటికి పనులు పూర్తి చేయాలని కేంద్ర మం త్రి రామ్మోహన్‌నాయుడు రెండు నెలల కిందట కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:22 PM