Share News

తిలారును అభివృద్ధి చేస్తా: మంత్రి

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:56 PM

తిలారు పంచాయతీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

తిలారును అభివృద్ధి చేస్తా: మంత్రి
మంత్రికి సమస్యలు చెబుతున్న తిలారు గ్రామస్థులు

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): తిలారు పంచాయతీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళుతుండగా తిలారు గ్రామం వద్ద మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, గ్రామపెద్దలు, గ్రామస్థులు కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తిలారును సమస్యలు లేని పంచాయతీగా మార్చుతానని హామీ ఇచ్చారు. మంత్రిని గ్రామస్థులు దుశ్శాలువతో సత్కరించారు. ఆయనతో పాటు నరసన్నపేట ఎమ్యెల్యే బగ్గు రమణ మూర్తి, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షులు హరివరప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:56 PM