Share News

వన్యప్రాణులు విలవిల

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:24 AM

Animals problems వేసవిలో దప్పికతో అటవీ ప్రాంతం నుంచి మైదానం వైపు వచ్చిన వన్యప్రాణులు దాడులకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. కాశీబుగ్గ అటవీ రేంజ్‌ పరిధిలో 11 వేల హెక్టార్ల అటవీ భూమి ఉంది. తూర్పు కనుమల్లో భాగంగా ఎత్తయిన మహేంద్రగిరులు, చీకటి కొండల్లో చుక్కల దుప్పిలు, జింకలు, కనుజులు, నెమళ్లు, అడవి పందులు, ఎలుగుబంట్లు, కొండచిలువలు, కింగ్‌కోబ్రాలు, కోతులు, కొండముచ్చులు ఉన్నాయి.

వన్యప్రాణులు విలవిల

  • అంతరించిపోతున్న అడవులు

  • మైదానానికి వచ్చి బలైపోతున్న వైనం

  • గత 15న రత్తకన్న సమీపంలో ఓ జింకపై కుక్కలు దాడి చేసి హతమార్చాయి. ఒడిశా సరిహద్దు కొండల నుంచి దాహంతో బాహుదా నది వైపు వచ్చిన జింక రత్తకన్న వైపు వచ్చే క్రమంలో కుక్కల బారిన పడింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

  • ఉద్దానం ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ముళ్ల కంచెల మధ్య ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నాయి. మరికొన్నిసార్లు రైతులు పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్‌ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రజలు భయాందోళనతో వాటిపై దాడికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి.

  • ఇచ్ఛాపురం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వేసవిలో దప్పికతో అటవీ ప్రాంతం నుంచి మైదానం వైపు వచ్చిన వన్యప్రాణులు దాడులకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. కాశీబుగ్గ అటవీ రేంజ్‌ పరిధిలో 11 వేల హెక్టార్ల అటవీ భూమి ఉంది. తూర్పు కనుమల్లో భాగంగా ఎత్తయిన మహేంద్రగిరులు, చీకటి కొండల్లో చుక్కల దుప్పిలు, జింకలు, కనుజులు, నెమళ్లు, అడవి పందులు, ఎలుగుబంట్లు, కొండచిలువలు, కింగ్‌కోబ్రాలు, కోతులు, కొండముచ్చులు ఉన్నాయి. రానురాను వీటి సంఖ్య తగ్గుతోంది. వన్యప్రాణులు ఉన్నచోట కంకర, గ్రానైట్‌, రాళ్లు, మట్టి తవ్వకూడదు. కానీ అటవీ ప్రాంతాల్లో అనధికార తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీనికితోడు రాళ్లు పేళుళ్ల ధాటికి కొండలు, అడవుల్లో ఉండాల్సిన జంతువులు మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. రైలు పట్టాల కింద, వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలవుతున్నాయి. ముఖ్యంగా దాహార్తి తీర్చుకునేందుకు వచ్చి కుక్కలు బారిన పడుతున్నాయి. తితలీ తుఫాన్‌ సమయంలో అటవీ ప్రాంతం కకావికలమైంది. పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. అప్పటి నుంచి జంతువులకు రక్షణ లేకుండా పోయింది.

  • ఏటా అటవీశాఖ నిధులు విడుదల చేయడం పరిపాటి. వాటితోనే నీటి తొట్టెలు, కందకాల నిర్మాణం, మరమ్మతులు, ట్యాంకుల ద్వారా నీటిని నింపడం వంటివి చేస్తుంటారు. వైసీపీ హయాంలో వన్యప్రాణుల సంరక్షణను పట్టించుకోలేదు. కనీసస్థాయిలో నిధులు లేక నిర్వహణ కరువైంది. ఎక్కడికక్కడే తొట్టెలు దెబ్బతిన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వన్యప్రాణుల సంరక్షణపై దృష్టిపెట్టారు. నిధులు విడుదల చేశారు. దీంతో ఈ ఏడాది వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.

  • ఇవి చేయాలి..

  • వేసవిలో వన్యప్రాణులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాయి. తగినంత నీరు, ఆహారం లభ్యం కాదు. ఆ సమయంలోనే అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి నీరు నింపాలి. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో చెరువులు తవ్వించాలి. చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేయాలి. వన్యప్రాణులు మైదాన ప్రాంతాల వైపు వెళ్లకుండా అడవుల నరికివేతను అడ్డుకోవాలి. క్వారీల నిర్వహణకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. రెవెన్యూ, భూగర్భ గనులు, అటవీశాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి.

  • ప్రత్యేక దృష్టి..

  • వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వేసవిలో అవి దాహం తీర్చుకునే విధంగా తొట్టెలను అందుబాటులోకి తెచ్చాం. కందకాల నిర్మాణం చేపట్టాం. కుక్కల దాడితోనే జింకలు మృతి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండల సమీప ప్రాంతాల్లో ఉప్పు బస్తాలను ఏర్పాటు చేస్తున్నాం. జింకలకు ఉప్పు రుచి చూస్తే చాలు దాహం తీరిపోతుంది. దీనివల్ల కుక్కల బారి నుంచి కూడా వాటిని కాపాడొచ్చు. కుక్కలను అరికట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. జనావాసాల్లో అటవీ జంతువులు కనిపిస్తే దాడలుఉ చేయకుండా.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి.

  • - మరళీకృష్ణమ నాయుడు, అటవీరేంజ్‌ అధికారి, కాశీబుగ్గ

Updated Date - Mar 03 , 2026 | 12:24 AM