Share News

భర్తకు తలకొరివి పెట్టిన భార్య

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:26 PM

అనారోగ్యంతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన పలాసలో సోమవారం చోటుచేసుకుంది.

భర్తకు తలకొరివి పెట్టిన భార్య
భర్తకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న భార్య సరస్వతి

పలాస, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన పలాసలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎన్టీఆర్‌ గృహ సముదాయంలో నివాసం ఉంటున్న నెయ్యిల ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య సరస్వతి తప్పా పిల్లలు లేరు. బంధువులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్థానికుల సూచన మేరకు భార్య సరస్వతి భర్త అంత్యక్రియలను నిర్వహించింది. పాడిమోయడంతో పాటు తలకొరివి పెట్టడం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేసింది.

Updated Date - Jun 29 , 2026 | 11:26 PM