భర్తకు తలకొరివి పెట్టిన భార్య
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:35 PM
అనారోగ్యంతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన మండ లంలోని నీలాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
టెక్కలి/రూరల్, జూన్ 13 (ఆంధ్రజ్యో తి): అనారోగ్యంతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన మండ లంలోని నీలాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుప్పిలి ఉదయ్‌కు మార్ ఒక ఎలకా్ట్రనిక్ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఆయనకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు దేవీశ్రీ (9), చందనప్రియ (7), గోవింద్ (3) ఉన్నారు. పిల్లలు చిన్నవారు కావడంతో భార్య తన భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. కన్నీమున్నీరుగా విలపిస్తూనే భర్త చితికి నిప్పంటించింది.