భర్త మృతదేహానికి భార్య అంత్యక్రియలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:31 AM
పద్మతుల గ్రామానికి చెందిన గుడియా జానీ (61) అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు.
కంచిలి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పద్మతుల గ్రామానికి చెందిన గుడియా జానీ (61) అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి సంతానం లేదు. దీంతో భార్య భాగ్యవతి భర్త అంత్యక్రియలు నిర్వహించి అతని చితికి నిప్పంటించింది. ఈ ఘటన చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. నిరుపేద కుటుంబం కావడంతో గుడియా సంఘ నాయకులు దహన సంస్కారాలకు అవసరమైన సాయం అందిం చారు. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్న జానీ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.