Share News

చైర్‌పర్సన్‌ పీఠం దక్కెదెవరికో?

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:18 AM

In the Palasa and Ichchapuram municipalities election ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్‌ వేళ.. చైర్‌పర్సన్ల పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా.. గెలుపుపై ఎవరికివారు దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓటర్ల తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

చైర్‌పర్సన్‌ పీఠం దక్కెదెవరికో?
పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు

పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు

ఇచ్ఛాపురం/ పలాస, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి) :

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ

------------------

వార్డులు: 36

ఓటర్లు : 49,420

పోలింగ్‌ కేంద్రాలు : 67

ఎన్నికల సిబ్బంది : 572

భద్రతకు వినియోగిస్తున్న పోలీసులు: 250

‘పలాస’ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు

---------------------

వజ్జ గంగాభవాని (టీడీపీ)

తాళాసు శ్రీపద్మ(వైసీపీ)

బద్రి సీతమ్మ (కాంగ్రెస్‌)

దువ్వాడ శ్రీజ, లక్ష్మీప్రధాన్‌, మన్యాల రమ్య (ఇండిపెండెంట్‌)

=========

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ

వార్డులు: 28

ఓటర్లు : 32,451

పోలింగ్‌ కేంద్రాలు : 39

ఇచ్ఛాపురం చైర్‌పర్సన్‌ అభ్యర్థులు

---------------------

ఆశి లీలారాణి (టీడీపీ)

పిలక రాజ్యలక్ష్మి (వైసీపీ)

బిరాలు బుడ్డెపు (కాంగ్రెస్‌)

బచ్చు మంగమ్మ (ఇండిపెండెంట్‌)

ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్‌ వేళ.. చైర్‌పర్సన్ల పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా.. గెలుపుపై ఎవరికివారు దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓటర్ల తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ పీఠం కోసం నలుగురు బరిలో ఉన్నారు. టీడీపీ తరపున ఆశి లీలారాణి, వైసీపీ నుంచి పిలక రాజ్యలక్ష్మితోపాటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బిరాలు బుడ్డెపు, ఇండిపెండెంట్‌గా బచ్చు మంగమ్మ పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఒక్కసారి మాత్రమే గెలిచింది. వైసీపీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు విజయం సాధించింది. ఈసారి ఇచ్ఛాపురం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు సైతం తమ పట్టు కొనసాగుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడ గెలుపోటములపై చర్చలు మాత్రమే కాదు. పందాలు సైతం కొనసాగుతున్నాయి. అలాగే మొత్తం 28 వార్డులకుగానూ.. ఒకవార్డు (24) టీడీపీ సొంతమైంది. మిగిలిన 27 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 24వ వార్డులో కేవలం చైర్‌పర్సన్‌ ఎన్నిక మాత్రమే నిర్వహించనున్నారు. వార్డుల్లో కూడా కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 3న పోలింగ్‌ రోజు తేలనుంది.

‘పలాస’ బరిలో ఆరుగురు

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ బరిలో ఆరుగురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలాసకు చెందిన టీడీపీ అభ్యర్థి వజ్జ గంగాభవాని, వైసీపీ తరపున తాళాసు శ్రీపద్మ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అలాగే స్వతంత్రులుగా కాశీబుగ్గకు చెందిన దువ్వాడ శ్రీజ, మన్యాల రమ్య, లక్ష్మిప్రధాన్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బద్రి సీతమ్మ కూడా చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మరోవైపు 36 వార్డుల్లో వైకాపా కౌన్సిలర్లు పోటీలో ఉండగా, కూటమి తరపున టీడీపీ 30, జనసేన 5, బీజీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు. ఐదుస్థానాల్లో స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. 20 వార్డులో ఇండిపెండెంట్‌గా దువ్వాడ శ్రీకాంత్‌.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:18 AM