Share News

మునిసిపల్‌ పీఠం ఎవరిదో?

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:22 AM

Municipal battle in Amadalavalasa ఆమదాలవలస మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకునేందుకు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

మునిసిపల్‌ పీఠం ఎవరిదో?

  • ఆమదాలవలసలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు

  • సొంత మెజార్టీ సాధించేందుకు టీడీపీ కృషి

  • కూటమి శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం

  • ఆమదాలవలస, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకునేందుకు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌తోపాటు 28 వార్డులు ఉన్నాయి. ఈ నెల 26న ఎన్నిక జరనుంది. చైర్‌పర్సన్‌ స్థానానికి సంబంధించి ఆరుగురు, వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు 148 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం పూర్తయింది. ఈ నెల 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.

  • టీడీపీ తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల నామినేషన్‌ వేశారు. వైసీపీ తరపున మాజీ కౌన్సిలర్‌ బొడ్డేపల్లి అజంతాకుమారి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి సన్నిహితురాలు.. లఖినేని కళ్యాణి నామినేషన్‌ వేశారు. ఈసారి టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది. ఇరుపార్టీల నేతలూ మునిసిపల్‌ పీఠం తమదేనంటూ దీమా వ్యక్తం చేస్తున్నా.. గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  • సొంత మెజార్టీ దిశగా టీడీపీ

  • ఆమదాలవలస మునిసిపాలిటీ ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకూ టీడీపీ సొంతంగా మెజార్టీ సాధించి.. చైర్మన్‌/ చైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకోలేదు.

  • 1995 మునిసిపల్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మొదలవలస రమేష్‌పై.. కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి చైర్‌పర్సన్‌గా గెలుపొందారు.

  • 2000లో పరోక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పార్టీ అత్యధికంగా కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుంది. అప్పటి ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు బొడ్డేపల్లి రమేష్‌ చైర్మన్‌ పీఠాన్ని అధిరోహించారు.

  • 2014లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో రా ష్ట్ర విభజన నేపఽథ్యంలో కాంగ్రెస్‌పార్టీ రాజకీయంగా బలహీనపడినప్పటికీ మూడు కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకొని కీలకంగా నిలిచింది. ఆ ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే కాం గ్రెస్‌పార్టీ మద్దతు అప్పటి శ్రీకాకుళం, ఆమదాలవలస ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్‌, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌అఫీసియల్‌ ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్మినేని గీత చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిరోహించారు.

  • తాజా ఎన్నికల్లో ఎలాగైనా సొంత మెజార్టీ సాధించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌తోపాటు అత్యధిక కౌన్సిలర్‌ స్థానాల్లో విజయం సాధించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు.

  • కూటమి అభ్యర్థులు ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. అదే ఉత్సాహంతో మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచారం స్పీడ్‌ పెంచారు.

  • వైసీపీలో నిరాశ

  • వైసీపీ కూడా ఇంతవరకూ చైర్మన్‌/ చైర్‌పర్సన్‌ పీఠం అధిరోహించలేదు. ఈసారి ఎలాగైనా ఈ పీఠం దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ వైసీపీ పాలనలో పట్టణ అభివృద్ధి కుంటుపడింది. అప్పట్లో మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కేవలం 8 స్థానాలకే పరిమితమయ్యారు. ఇటువంటి పరిణామాలన్నీ వైసీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహ నింపుతున్నాయి. మరోవైపు వైసీపీలో వర్గవిభేదాల ఫలితంగా ఎన్నికల ప్రచారంలో వెనుకబడుతున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:22 AM