Share News

ప్రమాదానికి కారణమెవరు?

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:03 AM

పలాసలో తీవ్ర కలకలం రేపిన డి.దానయ్య(40) అనే గొర్రెల కాపరి మృతి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. రెండురోజుల కిందట స్థానిక పారిశ్రామిక వాడ రోడ్డులో బుల్లెట్‌ వాహనం ఢీకొని దానయ్య మృతి చెందాడు.

ప్రమాదానికి కారణమెవరు?

  • పలాసలో గొర్రెల కాపరి మృతి ఘటనలో భిన్నకోణం

  • మాజీ మంత్రి కుమారుడే బుల్లెట్‌తో ఢీకొన్నట్టు ఆరోపణలు

  • ఆయన్ను తప్పించే ప్రయత్నం?

  • సాక్ష్యాల కోసం జల్లెడపడుతున్న పోలీసులు

పలాస, జూలై 12(ఆంధ్రజ్యోతి): పలాసలో తీవ్ర కలకలం రేపిన డి.దానయ్య(40) అనే గొర్రెల కాపరి మృతి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. రెండురోజుల కిందట స్థానిక పారిశ్రామిక వాడ రోడ్డులో బుల్లెట్‌ వాహనం ఢీకొని దానయ్య మృతి చెందాడు. ఈ ప్రమాదానికి వైసీపీ యువనేత సిద్ధార్ధ త్యాడి (సిద్ధు) కారణమని కాశీబుగ్గ పోలీసు లు ఆయన్ను అదుపులోకి తీ సుకున్నారు. అయితే, ఈ ప్ర మాదానికి కారకుడు సిద్ధార్ధ కాదని, ఓ మాజీ మంత్రి కు మారుడంటూ ప్రచారం జరు గుతోంది. బుల్లెట్‌ను మాజీ మంత్రి తనయుడు నడుపుతూ ఎదురుగా రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాజీ మంత్రి కుమారుడితో పాటు దానయ్య రోడ్డుపై పడిపోయారని, దెబ్బలతో ఉన్న మాజీ మంత్రి తనయుడిని కొందరు కారులో తరలించినట్లు ప్రచారం ఉంది. ఇదంతా పది నిమిషాల్లో జరిగిపో యింది. అనంతరం ప్రమాదానికి కారణమైన బైక్‌తో వెళ్లిపోవడానికి సిద్ధార్ధ ప్రయత్నించే సమయంలో పద్మనాభపురం కాలనీకి చెందిన యువకులు పట్టు కొని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన కాశీబుగ్గ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సిద్ధార్ధకు ఎటువంటి దెబ్బలు లేకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా మొత్తం వ్యవస్థలను తప్పుదారి పట్టించే విధంగా సిద్ధార్ధ.. మృతుడు దానయ్య కుటుంబానికి న్యాయం చేయడానికి ముందుకు రావడంతో కొంతమంది నేతలు మధ్యవర్తిత్వం వహించారు. దానయ్య భార్య, పిల్లలకు భరోసా కల్పించే విధంగా రూ.8.50 లక్షలు పరిహారం ఇప్పించడానికి ఒప్పించారు. అయితే కేసును మాత్రం యథాతఽథంగా కొనసాగించాలని కోరినట్లు సమాచారం. నిజంగా ఆయనే ప్రమాదానికి కారకుడా? లేకా మాజీ మంత్రి తనయుడు ఉన్నాడా? అనేది సిద్ధార్ధే చెప్పాలి. ఆయన నోరు విప్పితే తప్పా అసలు నిందితుడు ఎవరనేది తెలియదు. దీనిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రమాదం జరిగిన ప్రాంతం, పాత జాతీయరహదారి, జీఎంఈ కాలనీ, పలాస బైపాస్‌రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలతో పాటు లక్ష్మీపురం, మడపాం, నాతవలస టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. మాజీ మంత్రి తనయుడు బైక్‌ నడుపుతూ ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద కనిపించాడని, అనంతరం రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణను వివరణ కోరగా.. ‘అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. ఆధారాలు ఏవీ మాకు లభ్యం కాలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సూక్ష్మంగా కేసు దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకువస్తాం. నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తప్పుచేసిన వారు చట్టం ముందు తప్పించుకోలేరు’ అని అన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 12:03 AM