అడ్డుకునేదెవరు?
ABN , Publish Date - May 04 , 2026 | 12:10 AM
నరసన్నపేట పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. సుడా అనుమతులు లేకుండానే భారీ భవంతులు వెలుస్తున్నాయి.
-నరసన్నపేటలో జోరుగా అక్రమ నిర్మాణాలు
-అనుమతులు లేకుండానే పనులు
నరసన్నపేట, మే 3(ఆంధ్రజ్యోతి):నరసన్నపేట పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. సుడా అనుమతులు లేకుండానే భారీ భవంతులు వెలుస్తున్నాయి. పంచాయతీకి గానీ, సుడాకు గానీ ఎటువంటి ఫీజు చెల్లించకుండా వందకు పైగా నిర్మాణాలు సాగుతున్నాయి. ప్లాన్ ప్రకారం భవన నిర్మాణం ఎంత విలువ చేస్తుందో ఆ విలువలో 10 శాతం వరకు ప్రభుత్వానికి పన్ను కింద చెల్లించా లి. అలాగే లేబర్ సెస్‌తో పాటు అగ్నిమాపక శాఖ అనుమతి కూడా తీసుకోవాలి. అయితే, ఇవేవీ లేకుండానే బహుళ అంతస్థులు వెలుస్తున్నాయి. పంచాయతీ కార్యాలయం పక్కనే ఒక షాపు యజ మాని ఆదివారం తెల్లవారుజామున శ్లాబు పనులు చేపట్టాడు. అలాగే వీరన్నాయుడు కాలనీ, మెయిన్ రోడ్డు, మారుతీనగర్, నేతాజీవీధి, ఇందిరానగర్ కాలనీ, హోడ్కోకాలనీ, కళాసీకాలనీ, శ్రీరామనగర్, సౌభాగ్యలక్ష్మి కళ్యాణమండపం వద్ద, బజారువీధి, మఠం వీధుల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగు తున్నాయి. కొందరు సుడా అనుమతి కోసం దరఖాస్తు చేశారు. కానీ, ఎటువంటి అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. వీరికి కూటమి నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరో పణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను అ డ్డుకునే నాథుడు లేకపోవడంతో ప్రతిఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని పంచాయతీ కోల్పోవల్సి వస్తుంది. దీనిపై ఈవో పల్లి ద్రాక్షాయిణి వివరణ కోరగా.. చాలా నిర్మాణాలకు పంచాయతీ అనుమ తి ఇవ్వలేదని, సుడా అనుమతి తీసుకొని నిర్మాణాలు చేట్టాలని తెలిపారు.
అనుమతులు లేకుండా పంచాయతీ కార్యాలయం వద్ద చేపడుతున్న నిర్మాణాలు