అధిక ధరలకు ఎరువుల విక్రయంపై కొరడా
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:23 PM
ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించిన చల్లవానిపేట కూడలిలో గల లక్ష్మీ ట్రేడర్స్ రిటైల్ డీలర్ లైసె న్స్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి వై.వి.మురళీకృష్ణ తెలిపారు.
జలుమూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించిన చల్లవానిపేట కూడలిలో గల లక్ష్మీ ట్రేడర్స్ రిటైల్ డీలర్ లైసె న్స్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి వై.వి.మురళీకృష్ణ తెలిపారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని రైతులు సీ.ఎం. కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో ఎరువుల దుకాణాన్ని గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీపై విచారణ చేపట్టారు. దుకాణంలోని ఎరువుల నిల్వలు, రికార్డులు, లావాదేవీలను పరిశీలించారు. ఎరువులను నిర్ణీత గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి) కంటే అధిక ధరలకు విక్రయించినట్లు రుజువు కావడంతో డీలర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులక ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధదలకే ఎరువులు విక్రయించాలని స్పష్టం చేశారు. ఎటువంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎల్.వి.మధు, మండల వ్యవసాయాధికారి రవికుమార్ పాల్గొన్నారు.
శివశక్తి ట్రేడర్స్ లైసెన్స్ సస్పెండ్
పాతపట్నంరూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సీధి జంక్షన్‌లో ఉన్న శివశక్తి ట్రేడర్స్ ఎరువుల దుకాణం లైసెన్స్‌ను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎరువులపై అధిక ధరలు వసూలు చేయడం, ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించడం వంటి చర్యలకు పాల్పడే ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. రైతులు ఎరువులను కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.