Share News

రైల్వేట్రాక్‌పై పనులు చేస్తుండగా..

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:08 AM

ఓ వెల్డింగ్‌ కార్మికుడు తన పనుల్లో నిమగ్నమైపోయి.. వస్తున్న రైలును గమనించక జరిగిన ప్రమాదంలో మృతి చెం దిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది.

 రైల్వేట్రాక్‌పై పనులు చేస్తుండగా..

  • రైలు ఢీకొని వెల్డింగ్‌ కార్మికుడు మృతి

నరసన్నపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఓ వెల్డింగ్‌ కార్మికుడు తన పనుల్లో నిమగ్నమైపోయి.. వస్తున్న రైలును గమనించక జరిగిన ప్రమాదంలో మృతి చెం దిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రోడ్డు రైల్వే ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు.. కామేశ్వరిపేట గ్రామ సమీపంలో గల వంశధార నది మీద ఉన్న రైల్వే వంతెనపై తిలారు గ్రామానికి చెందిన కోట అప్పారావు(47) శుక్రవారం వెల్డింగ్‌ పనులు చేస్తున్నాడు. ఇదే సమయంలో భువనేశ్వర్‌ నుంచి విశాఖ వైపు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో మృతి చెందాడు. వెల్డింగ్‌ పనులు చేస్తున్న సమయంలో రైలు బండిని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్టు ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ మధుసూధనరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి మృతిదేహాన్ని తరలించారు.

రైలు నుంచి జారిపడి ఒడిశా వాసి మృతి

నరసన్నపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): చిక్కాలవలస- దాసరివానిపేట గ్రామాలు మధ్య రైల్వే మార్గంలో రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కాళీఖట్‌ ప్రాంతానికి చెందిన సబిశంకర్‌ ప్రాణిగ్రహీ (35) మృతిచెందినట్లు ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. గురువారం రాత్రి సమయంలో విశాఖ నుంచి భువనేశ్వర్‌ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కుటంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు రైల్వేపోలీసులు తెలిపారు.

పేలు నివారణమందు తాగి వృద్ధురాలు..

జలుమూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మతిస్థి మితం లేని ఓ వృద్ధురాలు పేలు నివారణమందు తాగి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలం లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సురవరం గ్రామానికి చెందిన పిట్ల దుర్గమ్మ(70) భర్త మల్లేశ్వరరావు పదేళ్ల కిందట మర ణించాడు. ఈమెకు పెళ్లై వేర్వేరుగా ఉంటున్న ము గ్గురు కుమారులు ఉన్నారు. దీంతో దుర్గమ్మ గ్రామంలోనే వేరేగా ఉంటూ జీవనం సాగిస్తుంది. మతి స్థితిమితం లేకపోవడంతో ఇంట్లో ఉన్న పేలు నివారణ మందును శుక్రవారం ఆమె తాగేసింది. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న దుర్గమ్మను గ్రామస్థులు గమనించి వెంటనే 108 వాహనంలో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పెద్ద కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 12:08 AM