పొలం పనులు చేస్తూనే..
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:46 AM
మందస మండలం జిల్లుండ గ్రామంలో ఆర్ .తిరుపతిరావు(30) అనే యువకుడు పొలం పనులు చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి మృత్యువాత పడిన సంఘటన చోటు చేసుకుంది.
కుప్పకూలి యువకుడి మృతి
హరిపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మందస మండలం జిల్లుండ గ్రామంలో ఆర్ .తిరుపతిరావు(30) అనే యువకుడు పొలం పనులు చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి మృత్యువాత పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తిరుపతిరావుకు జిల్లుండ గ్రామం సమీపంలో మధ్య గ్రామం వద్ద పొలం ఉంది. సోమవారం దమ్ము పెట్టేందుకు గట్లు వేసి పొలాన్ని సిద్ధం చేస్తూ... మధ్యాహ్నం 12గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు యువకుడికి సపర్యలు చేసి 108కి ఫోన్‌చేయగా సిబ్బంది వచ్చి పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు వారు నిర్థారించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మందస పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. మృతుడికి భార్య, దివ్యాంగుడైన కుమారుడు ఉన్నారు.