సంతకు వెళ్లి వస్తుండగా.. కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:45 PM
కొత్తూరు మండలంలోని బమ్మిడి గ్రామానికి చెందిన ఎస్. గౌరునాయుడు(65) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మ రణం పాలయ్యాడు.
కొత్తూరు, (మెళియాపుట్టి), నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలంలోని బమ్మిడి గ్రామానికి చెందిన ఎస్. గౌరునాయుడు(65) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మ రణం పాలయ్యాడు. ఎస్‌ఐ వెంకటేష్, స్థానికుల కథనం మేరకు.. గౌరునాయుడుతోపాటు బమ్మిడి గ్రామానికి చెం దిన జి.సత్యం హిరమండలంలోని సంతకు ఆవులు కొను గోలుచేయడానికి వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుం డగా నీలకంఠాపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. దీంతోగౌరునాయుడు అక్కడిక్కడే మృతిచెందాడు. సత్యాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేశారు.