ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:33 PM
ఆస్పత్రి నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీకుమారుడిని బస్సు ఢీకొంది.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు
తల్లి దుర్మరణం.. కుమారుడికి తీవ్ర గాయాలు
నందిగాం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీకుమారుడిని బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంత బొమ్మాళి మండలం ఇజ్జువరం పంచాయతీ రాజ గోపాలపురం గ్రామానికి చెందిన జడ్యాడ అనసూ యమ్మ(55) ముడుకునొప్పితో బాధపడుతుంది. శనివారం ఉదయం తన కుమారుడు ఉమాపతి రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై పలాస ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యుడిని చూపించారు. శనివారం సాయంత్రం ఆస్పత్రి నుంచి తిరిగి ఇం టికి వస్తుండగా నందిగాం వల్లయికానా సమీపంలో వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న అనసూయమ్మ కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న ఉమాపతిరావుకు కుడిచేయి విరిగింది. ఈయన్ను హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిఫర్ చేశారు. అనసూయమ్మకు భర్త దామోదర రావుతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. నందిగాం పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.