వ్యాపారం ముగించుకుని వస్తుండగా..
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:52 PM
మందస మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం లారీ ఢీకొనడంతో ద్వి చక్ర వాహనంపై వస్తు న్న హరి బెహరా (56) మృతి చెందాడు.
లారీ ఢీకొని ఒడిశా వాసి మృతి
మందస, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మందస మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం లారీ ఢీకొనడంతో ద్వి చక్ర వాహనంపై వస్తు న్న హరి బెహరా (56) మృతి చెందాడు. ఎస్ఐ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నౌగాం గ్రామానికి చెందిన హరి బెహరా ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం వ్యాపారం ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో తీవ్ర గాయాల పాలైన హరి బెహరాను స్థానికులు గుర్తించి 108లో హరిపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో లారీ నెంబరును గు ర్తించి... ఇచ్ఛాపురం బోర్డర్లో లారీని పోలీసులు పట్టుకున్నారు. మృత దేహా నికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్టు ఎస్ఐ తెలి పారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.