Share News

విహార యాత్రకు వెళ్లి...

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:14 AM

రెక్కడితేగానీ డొక్కాడని కుటుంటం. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తే...కష్టాలు గట్టెక్కుతాయని ఆశించింది.

  విహార యాత్రకు వెళ్లి...
వైకుంఠరావు (ఫైల్‌)

వాహన ప్రమాదంలో గాయపడిన విద్యార్థి

చికిత్స పొందుతూ మృతి ఫ నిరుపేద కుటుంబంలో విషాదం

నరసన్నపేట, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రెక్కడితేగానీ డొక్కాడని కుటుంటం. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తే...కష్టాలు గట్టెక్కుతాయని ఆశించింది. పైసాపైసా కూడబెట్టి తల్లిదండ్రులు ఆ బిడ్డను చదివించారు. ఆ కుటుంబంపై విధికి కన్నుకుట్టిందేమో...కుమారుడిని అర్థాంతరంగా మృత్యువాత పడేలా చేసింది. గ్రామస్థులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కంబకాయి గ్రామానికి చెందిన లింగబేరి శ్రీనివాసరావు, హేమలతల కుమారుడు వైకుంఠరావు (19) కాకినాడలోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జూలై 29న స్నేహితులతో కలిసి నర్సీపట్నంకు ఓ వాహనంలో విహార యాత్రకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వీరు ఉన్న వాహనం నాతవరం వద్ద బొల్తాపడింది ఈ ప్రమాదంలో వైకుంఠరావు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ పది రోజులు పాటు మృత్యువుతో పోరాడి...కన్నుమూశాడు. కన్న కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు...బిడ్డ ఇక లేడనే సమాచారం తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారరు. అన్నయ్య రాఖీ పండుగకు వస్తాడు.. తాను రాఖీ కడతానని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సోదరి సుగుణ... వైకుఠంరావు మృతిచెందిన విషయం తెలిసి కుప్పకూలింది. ఈ ఘటనతో గ్రామం విషాదంలో కూరుకుపోయింది.

Updated Date - Aug 08 , 2026 | 12:14 AM