Share News

కోళ్లఫారానికి ఫెన్సింగ్‌ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:47 PM

కుప్పిలిలో కోళ్ల ఫారానికి ఫెన్సింగ్‌ కడుతుండగా ఓ యువకుడు విద్యుదా ఘాతానికి గురై మృతి చెందాడు

కోళ్లఫారానికి ఫెన్సింగ్‌ కడుతుండగా..  విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి
షణ్ముఖరావు (ఫైల్‌)

ఎచ్చెర్ల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కుప్పిలిలో కోళ్ల ఫారానికి ఫెన్సింగ్‌ కడుతుండగా ఓ యువకుడు విద్యుదా ఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. దుంప షణ్ముఖరావు (20) గ్రామంలో ఉన్న బంధువుల కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి కోళ్లఫారానికి ఫెన్సింగ్‌ కడుతుండగా విద్యుత్‌వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామానికి చెందిన కుప్పేష్‌,సుబ్బమ్మ దంపతులకు నలుగురుసంతానం కాగా, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమార్తెలకు వివాహం కాగా కుమారులకు వివాహం కాలేదు. కుమారుల్లో షణ్ముఖరావు రెండో వాడు. చేతికి అందొచ్చిన కుమారుడు అర్ధంతరంగా మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని వేదనకు గురైంది. అప్పటివరకు అందరితోనూ సరదాగా ఉన్న షణ్ముఖరావు అంతలోనే మృతిచెందాడని తెలిసి గ్రామస్థులు శోక సం ద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి ఆదివారం శ్రీకాకుళం సర్వజనాసుప త్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతం కుటుంబ సభ్యులకు అప్పగించా రు. తండ్రి కుప్పేష్‌ ఫిర్యాదుమేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 01 , 2026 | 11:47 PM