Share News

ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా...

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:45 PM

రాయిపాడు గ్రామంలో మంగళవారం విద్యుత్‌ షాక్‌తో పైల సూర్యనారాయణ (సూరయ్య) (52) అనే తాపీ మేస్త్రి మృతి చెందాడు. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు వివరాలివీ...

 ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా...
సూర్యనారాయణ (ఫైల్‌)

కోటబొమ్మాళి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాయిపాడు గ్రామంలో మంగళవారం విద్యుత్‌ షాక్‌తో పైల సూర్యనారాయణ (సూరయ్య) (52) అనే తాపీ మేస్త్రి మృతి చెందాడు. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు వివరాలివీ... గ్రామానికి చెందిన కోట వెంకటరావు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా... ఇంటిపై ఉన్న విద్యుత్‌ లైన్‌కు సంబంధించిన వైరు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉత్తరమ్మ, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు అనురాధ, భవాని ఉన్నారు. అప్పటి వరకు తమతో సరదాగా పని చేసిన సూర్యనారాయణ అంతలోనే మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ గ్రామానికి వెళ్లి... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Oct 06 , 2026 | 11:45 PM