సొంత ఊరికి వెళుతూ..
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:57 PM
మండలంలోని కోవిలాం కాలనీ సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం అర్దరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ధనుకువాడ గ్రామానికి చెందిన తర్ర జగన్మోహనరావు(35) మృతిచెందాడు.
ఎల్.ఎన్.పేట, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోవిలాం కాలనీ సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం అర్దరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ధనుకువాడ గ్రామానికి చెందిన తర్ర జగన్మోహనరావు(35) మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీనర్సుపేట జంక్షన్ నుంచి స్వగ్రామ మైన ధనుకువాడకు జగన్మోహన్ ద్విచక్ర వాహనంపై వస్తూ.. అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. దీంతో తలకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సరుబుజ్జిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడుప. మృతుని తమ్ముడు మురళీమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.