చార్జర్ కొనుగోలుకు వెళుతూ..
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:12 AM
కుటుంబానికి అండగా నిలుస్తూ... భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కుటుంబానికి అండగా నిలుస్తూ... భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సరుబుజ్జిలి మండలం పాతపాడు గ్రామానికి చెందిన డోల సాయి శ్రీధర్ (30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వర్క్‌ఫ్రమ్ హోంలో భాగంగా కొన్ని నెలలుగా స్వగ్రామంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ చార్జర్ కొనుగోలుకు బుధవారం ఉదయం కారులో శ్రీకాకుళం నగరానికి బయలుదేరాడు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం నుంచి అంపోలు హైవే రహదారి వైపు వస్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న లారీని శ్రీధర్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్‌ఐ కరణం వెంకట సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి సవరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తండ్రిని కోల్పోయిన చిన్నారి
మృతుడు శ్రీధర్‌కు 2023లో తెలుగుపెంట గ్రామానికి చెందిన ఉషతో వివాహమైంది. వీరికి 18 నెలల పాప ఉంది. తండ్రి ప్రేమను పూర్తిగా ఆస్వాదించకముందే ఆ పాపకు ఆయన దూరమైన ఘటన స్వగ్రామంలోనూ, కుటుంబంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికందిన కొడుకు అకాల మరణంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగి పోయారు.