Share News

రోడ్డు దాటుతుండగా..

ABN , Publish Date - May 03 , 2026 | 12:12 AM

మండల పరిధి తాళ్ల వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మీసాల రామ్మూర్తి (72) దుర్మరణం చెందాడు.

రోడ్డు దాటుతుండగా..

  • వ్యాన్‌ ఢీకొని వృద్ధుడి మృతి

లావేరు, మే 2(ఆంధ్రజ్యోతి): మండల పరిధి తాళ్ల వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మీసాల రామ్మూర్తి (72) దుర్మరణం చెందాడు. పోలీసులు తె లిపిన వివరాలిలా ఉన్నాయి.. తాళ్లవలస వద్ద తమ పంట పొలాలకు వెళ్లేందుకు రామ్మూర్తి రోడ్డు దాటు తుండగా విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న వ్యాన్‌ అతడిని బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య నారాయణమ్మ ఉన్నారు. శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కేఏ సూరి తెలిపారు.

నగలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు

శ్రీకాకుళం క్రైం, మే 2(ఆంధ్రజ్యోతి): తన భార్య పర్స్‌తో పాటు నగలు పోయాయని భర్త వెంపటాపు రమేష్‌ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామానికి చెందిన వెంపటాపు రమేష్‌, భార్య రమాదేవితో కలిసి మార్చి 14న ఎచ్చెర్ల గ్రామానికి ఆటోలో శుభకార్యానికి వెళుతుండగా నగరంలోని ఆదివారంపేట వద్ద పర్స్‌ కింద పడిపోయిందని, దానిలో రెండు బంగారం చైన్‌లు, రెండు చెవిదిద్దులు మొత్తం కలిపి సుమారు పావు తక్కువ మూడు తులాల బంగారం ఉంటుందని రమేష్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ హేమంత్‌కల్యాణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫోర్జరీ కేసులో నిందితుడికి రిమాండ్‌

పాతపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ ఇచ్చి మోసగించిన కేసులో ఎచ్చెర్ల మండలం కుశాలాపురం గ్రామా నికి చెందిన తమ్మినేని రాజశేఖర్‌బాబుకు న్యాయాధికారి 14 రోజులు రిమాండ్‌ విధించినట్టు పోలీసులు తెలిపారు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. తెంబూరు గ్రామానికి చెందిన చింతల సింహాచలం అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి.. ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ అందించాడు. అనంతరం ఈ విష యంతో తాను మోసపోయినట్టు గుర్తించిన సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ కెమధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. ఇచారణ అనంతరం నిందితుడు రాజశేఖర్‌బాను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 12:12 AM