వరి నారు పొలానికి తీసుకు వెళ్తుండగా..
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:52 PM
మండలంలోని దేవళ భద్ర గ్రామానికి చెందిన పట్నాన శివశంకర్ అలియాస్ చిన్న (33) అస్వస్థతకు గురై మంగళవారం మృతిచెందాడు.
నందిగాం, జనవరి20(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవళ భద్ర గ్రామానికి చెందిన పట్నాన శివశంకర్ అలియాస్ చిన్న (33) అస్వస్థతకు గురై మంగళవారం మృతిచెందాడు. బంధు వుల కథనం మేరకు.. పొలానికి వరినారు తీసుకువెళ్తుండగా చిన్న అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అక్కడున్న బంధు వులు ద్విచక్రవాహనంపై టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పటికే శివశంకర్ మృతిచెం దినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుకు గురై మృతిచెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.చిన్నకు మూడేళ్లకిందట వివాహం జరి గింది. భార్య మీనాక్షి, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయనకు ఇద్దరు సోదరులు ఉండగా బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తుండగా ఒకరు విధినిర్వహణలో, మరొకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇలా ముగ్గురు సోదరులు మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తమ పోషణ ఎలా జరుగుతుందని వాపోతున్నారు.ు